కబడ్డీ కోచ్ గా ‘తమన్నా’
BY Telugu Gateway8 Feb 2020 11:40 AM IST

X
Telugu Gateway8 Feb 2020 11:40 AM IST
ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ ‘స్పోర్ట్స్’ చుట్టూ తిరుగుతున్నాయి. క్రీడలతో కూడిన కథలతో వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఇంచుమించు విజయాలను దక్కించుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు గోపీచంద్, తమన్నాలు కూడా అదే బాటలో ఉన్నారు. ‘సీటీమార్’ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్ గా కన్పించబోతోంది.
ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ఈ సినిమాలో తమన్నా పాత్ర పేరు జ్వాలారెడ్డిగా నిర్ణయించారు. ఇప్పటికే హీరో గోపీచంద్ లుక్ ను విడుదల చేశారు. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
Next Story