Telugu Gateway
Andhra Pradesh

సాక్షిలో కీలక పరిణామం..ఏపీ రెసిడెంట్ ఎడిటర్ ఔట్!

సాక్షిలో కీలక పరిణామం..ఏపీ రెసిడెంట్ ఎడిటర్ ఔట్!
X

సాక్షి పత్రికలో కీలక పరిణామం. ఆంధ్రప్రదేశ్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న ధనుంజయ్ రెడ్డిని ఆ స్థానం తొలగించారు. అధికారికంగా ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉన్నా నిర్ణయం జరిగిపోయినట్లు ఆ పత్రిక వర్గాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. సహజంగా రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న వాళ్ళను తప్పించారు అంటే కారణం ఏమైనా బలమైన అరోపణలు రావటం.. లేదా అంతకంటే బలమైన ఇతర అంశాలు ఏమైనా ఉంటేనే ఇలాంటి నిర్ణయానికి వస్తారు. ఓ వైపు రిటైర్ అయిన వాళ్లను కూడా ఎక్స్ టెన్షన్ ఇచ్చి మరీ కీలక స్థానాల్లో కొనసాగిస్తున్న పత్రికలో అత్యంత కీలకమైన రెసిడెంట్ ఎడిటర్..అదీ వయస్సులో ఎంతో చిన్నవాడైన ధనుంజయ్ రెడ్డిని ఆ స్థానం నుంచి తప్పించటం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఆయన్ను తప్పించటానికి సాక్షి వర్గాల్లో రకరకాల అంశాలు ప్రచారంలో ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు రావటంతోపాటు వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పత్రిక అంశాలపై కంటే ఇతర అంశాలపై ధనుంజయ్ ఫోకస్ మారిందని యాజమాన్యం గుర్తించిందని..అందుకు ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

ఎప్పటి నుంచో ధనుంజయ్ రెడ్డి తీరుపై యాజమాన్యం అసంతృప్తితో ఉన్నా..ఇంత కాలం వేచిచూడటంతో పాటు తన తీరు సరిదిద్దుకోవటానికి ఓ ఛాన్స్ ఇచ్చి చూశారని..అయినా కూడా ఆయన వైఖరిలోఎలాంటి మార్పు లేకపోవటంతో రెసిడెంట్ ఎడిటర్ పదవి నుంచి తప్పించి..హైదరాబాద్ కు బదిలీ చేయటానికి నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఇది వైసీపీ వర్గాలతోపాటు సాక్షిలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఇఫ్పుడు వైసీపీ అధికారంలో ఉన్నందున పత్రిక సర్కులేషన్ ను సాధ్యమైనంత వరకూ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ తరుణంలో ఎడిటర్ వ్యవహారం తలనొప్పిగా మారటంతో చివరకు యాజమాన్యం కఠిన నిర్ణయానికి వచ్చిందని చెబుతున్నారు. అంతే కాదు దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న వాళ్లను కూడా మార్చే అవకాశం ఉందని..త్వరలోనే మరిన్ని కీలక మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

Next Story
Share it