బాబోయ్ రానా...బెదిరిస్తున్న ‘న్యూ లుక్’

దగ్గుబాటి రానా. క్యారెక్టర్ ఏదైనా తనదైన ముద్ర వేయటం ఆయన సొంతం. బాహుబలి సినిమాలో నెగిటివ్ రోల్స్ తో రానా ఇమేజ్ దేశ వ్యాప్తంగా ఓ కొత్త రేంజ్ వెళ్లింది. రానా తాజా సినిమా న్యూ లుక్ కూడా రానాను మరింత హైట్స్ కు తీసుకెళ్ళేలా ఉంది. రానా నటిస్తున్న బహుభాషా చిత్రం ‘హాథీ మేరే సాథీ’ . ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ఇందులో రానా ఓ గోనె సంచిలా ఉన్న షర్ట్ ధరించి..మాంత్రికుడి చేతిలో ఉండే ఓ దండంతో..భారీ గడ్డంతో బెదిరించేలా ఉన్నాడు.
ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. జంతువులు-మానవుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాదన్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువ భాగం కేరళ అడవుల్లో సాగింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, పుల్‌కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది.



