Telugu Gateway
Cinema

రాములో..రాములా 200 మిలియన్లు దాటేశాడు

రాములో..రాములా 200 మిలియన్లు దాటేశాడు
X

అల..వైకుంఠపురములో సినిమా విడుదలై నెల రోజులు దాటినా ఆ సినిమా పాటల దూకుడు ఏ మాత్రం ఆగటం లేదు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలో లేని బ్లాక్ బస్టర్ పాటలు ఈ సినిమా నుంచి వచ్చాయి. సామజవరగమనతోపాటు రాములో..రాములా..బుట్టబొమ్మ పాటలు దుమ్మురేపాయి. ఓ మైగాడ్ డాడీ, క్లైమాక్స్ సాంగ్ హిట్ అయినా..ఈ మూడు పాటలకు వచ్చిన క్రేజ్ మిగిలిన వాటికి రాలేదనే చెప్పొచ్చు.

అయితే రాములో..రాములా సాంగ్ ఏకంగా 200 మిలియన్లను దాటేసిందని ఆదిత్య మ్యూజిక్ వెల్లడించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డె నటించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వసూళ్లలోనూ నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతోపాటు ఈ సినిమా పాటలు మాత్రం ఇంకా హంగామా చేస్తూనే ఉన్నాయి.

Next Story
Share it