Telugu Gateway
Cinema

పూజా హెగ్డెకు లక్కీ ఛాన్స్

పూజా హెగ్డెకు లక్కీ ఛాన్స్
X

పూజా హెగ్డె. టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు. ఈ భామ చేసిన సినిమాలు అన్నీ మంచి హిట్స్ గా నిలుస్తున్నాయి. తాజాగా పూజా నటించిన అల..వైకుంఠపురములో ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. మరో వైపు టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది. గతంలోనే బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన నటించిన ఈ భామ ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఈ సారి సల్మాన్ ఖాన్ తో సినిమా దక్కించుకుంది. తెలుగులో అఖిల్‌తో కలసి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’, ప్రభాస్‌ 20వ సినిమాలో నటిస్తున్న పూజా ఇంత బిజీలోనూ బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పేసింది.

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా ఫర్హద్‌ సంజీ తెరకెక్కిస్తున్న ‘కబీ ఈద్‌ కబీ దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది. 2021 ఈద్‌ కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఈ సినిమాకు పూజా అయితేనే సరిగ్గా సరిపోతుందని ఆలోచించిన తర్వాతే ఆమెను ఎంచుకున్నట్లు నిర్మాత ఫర్హాద్ సంజీ తెలిపారు.

Next Story
Share it