Telugu Gateway
Cinema

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
X

ప్రచారమే నిజం అయింది. పవన్ కళ్యాణ్ మూడవ సినిమాకు కూడా రెడీ అయ్యారు. అది కూడా ఎవరితో అనుకుంటన్నారు?. గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన హరీష్ శంకర్ తో కలసి పవన్ కళ్యాణ్ ఈ సినిమాను చేయనున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ కు వెళ్లనున్నాయి. అంతే కాదు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నది ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ కావటం మరో విశేషం. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. అంతే కాదు మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రెండు సినిమాలను ఓకే చేశారు.

అందులో ఒకటి పింక్ రీమేక్ కాగా...మరొకటి ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. ఈ తరుణంలో అధికారికంగా మూడవ సినిమా ప్రకటన రావటం విశేషం. ఈ మూడవ సినిమా వార్త పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను మరింత సంతోషపర్చేది అనటంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు చేయటం తనకు తప్పనిసరి అని స్పష్టం చేసిన నేఫథ్యంలో ఆయన నుంచి అభిమానులు మరిన్ని సినిమాలు ఆశించటానికి లైన్ క్లియర్ అయినట్లు అయింది.

Next Story
Share it