Telugu Gateway
Andhra Pradesh

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత

ముందు ఈ పని చేయండి..మూడు రాజధానులు తర్వాత
X

‘రాష్ట్ర ప్రభుత్వానికి నా విన్నపం ఏమిటంటే మూడు రాజధానులు తర్వాత నిర్మించవచ్చు. ముందు పది వేల మంది కార్మికులకు ఉపయోగపడే జోహరాపురం వంతెన పూర్తి చేయండి. దీనికి కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటే ప్రజలు కూడా క్షమించరు" అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన గురువారం నాడు కూడా కొనసాగింది. రెండేళ్లు అయినా చిన్నపాటి జోహరాపురం బ్రిడ్జిని కూడా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు.

బాధ్యతగల ప్రజాప్రతినిధులను ఎన్నుకోకపోతే జరిగే నష్టం ఇదేనన్నారు. ప్రజా ప్రతినిధులను ఎన్నుకునే ముందు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు. డబ్బులు పడేశాం కాబట్టి ప్రజలు ఓటేశారని, ఇక వారికి పని చేయాల్సిన అవసరం లేదని నాయకులు భావిస్తున్నారు కనుక ఆలోచించి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలన్నారు. కర్నూలు ఓల్డ్‌ సిటీ జమ్మి చెట్టు ప్రాంతం, జోహరాపురం కాలనీ మధ్య హంద్రీ నదిపై డబుల్‌ లైన్‌ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పరిశీలించారు. బ్రిడ్జ్ పూర్తి కాకపోవడం వల్ల స్థానికులు ఎందుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Next Story
Share it