నాని కొత్త సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’
BY Telugu Gateway24 Feb 2020 8:25 PM IST
X
Telugu Gateway24 Feb 2020 8:25 PM IST
న్యాచురల్ స్టార్ నాని యమ దూకుడు మీద ఉన్నాడు. గ్యాప్ లేకుండా సినిమాలు ప్రకటించేస్తున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 24న కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. అదే ‘శ్యామ్ సింగరాయ్’. టైటిల్ విచిత్రంగా ఉంది. అసలు ఈ టైటిల్ కు..కథకు సంబంధం ఏంటో తెలియాలంటే చిత్ర యూనిట్ నోరు విప్పాల్సిందే. ఇది నాని 27వ చిత్రం. చిత్రాన్ని ప్రకటించిన రోజే..విడుదల తేదీని కూడా ప్రకటించేసింది చిత్ర యూనిట్.
ఈ కొత్త సినిమా శ్యామ్ సింగరాయ్ 2020 డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు. దర్శకుడు 'రాహుల్ సాంకృత్యన్' ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే తెలియజేస్తామని సినిమా యూనిట్ తెలిపింది. నాని హీరోగా నటించిన ‘వి’ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.
Next Story