నాగశౌర్య కొత్త సినిమా
BY Telugu Gateway13 Feb 2020 6:25 PM IST
X
Telugu Gateway13 Feb 2020 6:25 PM IST
నాగశౌర్య కొత్త సినిమాకు రెడీ అయ్యారు. ఈ సినిమాలో నాగశౌర్యకు జోడీగా రీతూ వర్మ నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ గురువారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల19 నుంచి ప్రారంభం కానుంది. చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి వంశీ పచ్చి పులుసు సినిమాటోగ్రపీ అందిస్తున్నారు.
Next Story