Telugu Gateway
Politics

ఆ బదిలీ రొటీన్ వ్యవహారమే

ఆ బదిలీ రొటీన్ వ్యవహారమే
X

ఢిల్లీ హైకోర్టు జడ్జి మురళీధర్ బదిలీ వివాదంపై కేంద్రం స్పందించింది. ఇది రొటీన్ వ్యవహారమే అని..ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు లేవని తేల్చిచెప్పింది. సాధారణ బదిలీల ప్రక్రియలో భాగంగానే ఇది జరిగిందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల ప్రకారమే మురళీధర్ ను పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేశామన్నారు. ఇందుకు ఆ జడ్జి ముందస్తు అనుమతి కూడా తీసుకున్నట్లు తెలిపారు. ఢిల్లీ అలర్లకు సంబంధించిన కేసులో ఆయన పదునైన వ్యాఖ్యలు చేయటంతోపాటు అల్లర్లకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.

ఇది జరిగిన కొద్దిసేపటికే బదిలీ ఉత్తర్వులు రావటం దుమారం రేపింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని బిజెపి నేతలను కాపాడుకునేందుకు జడ్జిని బదిలీ చేశారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు. ఈ చర్యతో బిజెపి ప్రతీకార రాజకీయాలు బహిర్గతం అయ్యాయన్నారు. రాహుల్ గాంధీ విమర్శలపై కూడా అధికార బిజెపి తీవ్రంగా తప్పుపట్టింది.

Next Story
Share it