Telugu Gateway
Politics

చట్టంలో ఏముందో మేము చెబుతాం..ఓల్డ్ సిటీ ఓవైసీ కాదు

చట్టంలో ఏముందో మేము చెబుతాం..ఓల్డ్ సిటీ ఓవైసీ కాదు
X

ఢిల్లీలో సీఏఏను వ్యతిరేకిస్తూ జరుగుతున్న అల్లర్లపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కొంత మంది దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఈ చట్టం వల్ల దేశంలో ఏ ఒక్కరికీ నష్టం ఉండదన్నారు. చట్టంలో ఏముందో చెప్పేది ప్రభుత్వంలో ఉన్న తామేనని. పాత బస్తీలో ఉన్న అసద్ ఉద్దీన్ ఒవైసి కాదని వ్యాఖ్యానించారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నోటికి అడ్డూ అదుపు లేకుండా పోతుంది. కేసీఆర్ అండ చూసుకుని రెచ్చిపోతున్నాడు. కేసీఆర్ పులి మీద స్వారీ చేస్తున్నాడు ఎంఐఎం పార్టీ దోస్తానాతో. మొన్న ఎంఐఎం పార్టీ నేత వారిస్ పఠాన్ 15 కోట్ల మంది 100కోట్లకు సరిపోతాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రాజకీయ అంశాలపై ప్రజల వద్దకు వెళ్ళండి.కానీ లేని అంశాన్ని ప్రచారం చేస్తూ..మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రతిపక్షగా రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

సీఏఏ లో దేశంలోని మైనారిటీ లకు నష్టం చేసే ఏ ఒక్క అంశం కూడా లేదన్నారు. ప్రధాని మోదీ భారత దేశ ప్రతిష్టను పెంచేలా ప్రయత్నం చేస్తున్నారు.మేకిన్ ఇండియా ద్వారా భారత్ ప్రపంచంలో అగ్రభాగాన ఉండాలి అని ప్రయత్నం చేస్తున్నారు.మోడీ ని విమర్శించడానికి ఏమీ లేదు అని సీఏఏపైన దుష్ప్రచారం చేస్తున్నారు. కేవలం దేశం కోసం పనిచేసే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. అవినీతి,బంధుప్రీతి,కుటుంబ పాలన లేని ప్రభుత్వం మోడీది.హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ,ఎంఐఎం పార్టీలు పోటాపోటీగా సభలు పెడుతున్నాయి సీఏఏ కి వ్యతిరేకంగా అని విమర్శించారు.

Next Story
Share it