ట్రంప్ తో కెసీఆర్ షేక్ హ్యాండ్
BY Telugu Gateway25 Feb 2020 9:04 PM IST

X
Telugu Gateway25 Feb 2020 9:04 PM IST
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్ధం భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ పాల్గొన్నారు. దేశం మొత్తం మీద ఎనిమిది మంది ముఖ్యమంత్రులకు మాత్రమే ఈ విందుకు ఆహ్వానం రాగా..అందులో కెసీఆర్ ఒకరు. ఈ విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ముఖ్యమంత్రి కెసీఆర్ కరచాలనం చేశారు.
తొలుత ట్రంప్ కు నమస్కారం చేసిన కెసీఆర్..ఆ తర్వాత చేయి కలిపారు. విందుకు హాజరైన అతిధులు అందరినీ ట్రంప్ కలుసుకున్నారు. రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ దంపతులతోపాటు..ట్రంప్ దంపతులు ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ వెళ్లారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర అతిధులు పాల్గొన్నారు.
Next Story