కార్తికేయ ‘చావు కబురు చల్లగా’
BY Telugu Gateway13 Feb 2020 6:28 PM IST

X
Telugu Gateway13 Feb 2020 6:28 PM IST
మాస్ సినిమాలో టాలీవుడ్ లో తనకంటూ ఓ మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నాడు హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా దగ్గర నుంచి కార్తికేయది అదే స్టైల్. తాజాగా 90ఎంఎల్ సినిమాలో నటించిన హీరో కార్తికేయ ఇప్పుడు ‘చావు కబురు చల్లగా’ సినిమా స్టార్ట్ చేశారు. కౌశిక్ అనే యువదర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'బస్తీ బాలరాజు' పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి సంబంధించిన పోస్టర్ ను కూడా చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది.
శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో ఆయన వున్నాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ గురువారం మొదలైంది.
Next Story