Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ‘లెక్కలు’ అంత సంక్లిష్టమా?

చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ‘లెక్కలు’ అంత సంక్లిష్టమా?
X

కొద్ది నెలల క్రితం హైదరాబాద్ లో ఓ అగ్రశ్రేణి మౌలికసదుపాయాల కల్పనా సంస్థపై ఐటి దాడులు జరిగాయి. ఆ సంస్థ దేశంలోనే టాప్ త్రీ కంపెనీల్లో ఒకటి. ఆ సంస్థపై ఐటి దాడులే రెండు..మూడు రోజుల్లో ముగిసిపోయాయి. అంటే వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే కంపెనీపై దాడులు చేస్తే మూడు రోజుల్లో ‘లెక్కలు తేలిపోయాయి’. అప్పట్లో ఐటి శాఖ ఓ ప్రెస్ నోట్ విడుదల చేసి సదరు కంపెనీ హవాలా లావాదేవీలు చేసిందని..బోగస్ ఇన్వాయిస్ గోల్ మాల్ కు పాల్పడింది అని తేల్చింది. కానీ ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. కానీ వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉండే కంపెనీలో దేశ వ్యాప్త తనిఖీలనే గరిష్టంగా మూడు రోజుల్లో పూర్తి చేసిన అధికారులు ఓ ప్రభుత్వ ఉద్యోగి..కాకపోతే మాజీ సీఎం దగ్గర చేశారు. ఆయన ఇంట్లో ఐదు రోజుల నుంచి ఐటి సోదాలు అంటే అషామాషీ వ్యవహారం కాదు. ఎందుకంటే ఆయనకు వచ్చే జీతం ఎంతో లెక్క ఉంటుంది. వ్యవసాయం లేదా ఇతర ఆధాయం ఏదైనా ఉంటే అదీ లెక్క ఉంటుంది. లెక్కకు మించి ఆదాయం ఉంటే ఆ లెక్క కూడా ఈజీగానే తేలుతుంది.

కానీ ఐదు రోజుల నుంచి ఈ దాడులు జరుగుతున్నాయంటే ఇది శ్రీనివాస్ ఆదాయం కంటే ‘అంతకుమించి’ ఏదో జరుగుతోంది అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పీఎస్ శ్రీనివాస్ మాజీ సీఎం చంద్రబాబు దగ్గర వివిధ హోదాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటుపనిచేశారు. ఈ ఐటి దాడులు జరుగుతున్న తీరు చూస్తుంటే ఇది ఖచ్చితంగా శ్రీనివాస్ కు సంబంధించిన ‘లెక్కలు’ కాదని అర్ధం అవుతోందని టీడీపీ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ళ కాలంలో చంద్రబాబు దగ్గర జరిగిన లావాదేవీలు..కాంట్రాక్ట్ లు కేటాయింపులు..నిధుల మళ్ళింపులు ఇలాంటి విషయాలు అన్నింటిపై కూపీ లాగుతున్నందునే ఈ జాప్యం జరుగుతోందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి తెలిపారు. శ్రీనివాస్ లావాదేవీలపై ఐటి శాఖకు ఇంత కసరత్తు చేయాల్సిన అవసరం లేదని..ఇది పూర్తిగా చంద్రబాబు, ఆయన సన్నిహితులకు సంబంధించిన వివరాలు..లావాదేవీలపై ఆరా తీయటంపైనే ‘ఫోకస్’ పెట్టినట్లు స్పష్టం అవుతోందని ఆయన తెలిపారు.

పెద్ద పెద్ద కంపెనీల్లోనే గరిష్టంగా రెండు, మూడు రోజుల్లోనే పూర్తయ్యే ఐటి సోదాలు శ్రీనివాస్ విషయంలో ఐదు రోజుల పాటు సాగటం మామూలు విషయం కాదని..దీనివెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయని చెబుతున్నారు. తాజాగా ఏపీలో చోటుచేసుకున్న ఐటి దాడుల వ్యవహారం వ్యవహారం టీడీపీలో కలకలం రేపుతోంది. ఐటి శాఖ అధికారులకు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఏమి చెప్పారన్నదే అత్యంత కీలకంగా మారబోతుంది. ఓ వైపు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీఐడీ కేసులు..మరో వైపు ఐటి దాడులతో ఎటువైపు నుంచి ఎవరిపై కేసులు నమోదు అవుతాయా అన్న టెన్షన్ టీడీపీ వర్గాల్లో నెలకొందని చెబుతున్నారు.

Next Story
Share it