Telugu Gateway
Cinema

‘హిట్’ ట్రైలర్ విడుదల

‘హిట్’ ట్రైలర్ విడుదల
X

ఈ సినిమాకు హీరో నాని నిర్మాత. కొత్త కథలు..కొత్త దర్శకులతో సినిమాలు చేసేందుకు ఆయన పెట్టిన సంస్థే ‘వాల్ పోస్టర్’ బ్యానర్. ఇప్పుడు అదే బ్యానర్ పై తెరకెక్కిన సినిమా ‘హిట్’. ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర యూనిట్ బుధవారం నాడు సినిమా ట్రైలర్ విడుదల చేసింది. ఇందులో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తుండగా..హీరోయిన్ గా రుహానా శర్మ నటిస్తోంది. ట్రైలర్ ను చూస్తే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అనే విషయం స్పష్టం అవుతోంది. పోలీస్ అధికారి పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమాలో మురళీ శర్మ, భానుచందర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వివేక్‌ సాగర్‌ సంగీతమందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=uYdsWe9iBAA

Next Story
Share it