జెబీఎస్- ఎంజీబీఎస్ రూట్ లో మెట్రో సేవలు షురూ

నగరంలోని అత్యంత కీలకమైన జూబ్లీ బస్ స్టేషన్ (జెబీఎస్), మహాత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)మార్గంలో మైట్రో రైలు పరుగులు తీసింది. ఈ రూట్ లో మెట్రో సేవలను తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కెసీఆర్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గం నిడివి పదకొండు కిలోమీటర్లు. ఈ మార్గం పూర్తితో నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చినట్లు అయింది.
ఈ మెట్రో రైలు మార్గంలో జేబీఎస్-పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్ వెస్ట్, న్యూ గాంధీ హాస్పటల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాలు పట్టనుంది. హైదరాబాద్ లో మెట్రో రైలు సూపర్ సక్సెస్ అయింది. చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలను మెట్రో తీర్చినట్లు అయింది.