Telugu Gateway
Politics

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు

వ్యవసాయ ఉత్పత్తుల కోసం ప్రత్యేక విమాన సర్వీసులు
X

కేంద్ర బడ్జెట్ లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పలు స్కీమ్ లు ప్రకటించింది. వ్యవసాయ ఉత్పత్తుల కోసం ‘కిసాన్ ఉడాన్’ పేరుతో ప్రత్యేక విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశీయ మార్కెట్ తోపాటు విదేశీ మార్కెట్లకు తరలించేందుకు వీలుగా ఈ సేవలు ఉండబోతున్నాయని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఈ దిశగా చర్యలు చేపడుతుందని తెలిపారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2006-16 మధ్య పేదరికం నుంచి 22 కోట్లమంది బయటపడ్డారని తెలిపారు.

‘ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన ద్వారా పేదలందరికి ఇళ్ల నిర్మాణం. 2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గింది. 284 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎఫ్‌డీఐలు చేరాయి. జీఎస్టీ శ్లాబ్‌ల తగ్గింపుతో సామాన్యులకు మేలు జరిగింది.ఏప్రిల్ నుంచి పన్ను చెల్లింపులు మరింత సరళం. యువత ను మరింత శక్తిమంతం చేసేవిదంగా ప్రభుత్వ ప్రాధాన్యలు ఉంటాయి. 2019లో కేంద్రంపై రుణభారం 48.7 శాతం తగ్గింది. ఆర్థిక వ్యవస్థ మూలాల బలంగా ఉన్నాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంది. కేంద్ర మొదటి ప్రాధాన్య అంశం వ్యవసాయ. సాగునీరు.గ్రామీణాభివృద్ధి. 2022 లోగా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం’ అని ప్రకటించారు.

Next Story
Share it