‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ విడుదల
BY Telugu Gateway25 Feb 2020 8:40 PM IST

X
Telugu Gateway25 Feb 2020 8:40 PM IST
అల..వైకుంఠపురములో సక్సెస్ ను మరింత క్యాష్ చేసుకునే పనిలో పడింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో పాటలు ఎంత సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. ఎక్కడా చూసినా ఇవే పాటలు. మళ్ళీ మళ్ళీ వినాలన్పించేలా ఉన్న సాంగ్స్ కావటంతో వీటికి క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఇదే అదనుగా చిత్ర యూనిట్ వరస పెట్టి పూర్తి వీడియో సాంగ్స్ ను విడుదల చేస్తోంది. ఇఫ్పటికే పలు పాటలు విడుదల చేసిన యూనిట్ మంగళవారం నాడు ‘బుట్టబొమ్మ’ వీడియో సాంగ్ ను యూట్యూబ్ లో విడుదల చేసింది. ఈ పాటలో అల్లు అర్జున్ స్టైలిష్ డ్యాన్స్..పూజా హెగ్డె అందాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ పాట యూట్యూబ్ లో విడుదల చేసిన నాలుగు గంటల్లోనే 1.1 మిలియన్ల వ్యూస్ తో దూసుకెళుతోంది.
https://www.youtube.com/watch?v=2mDCVzruYzQ
Next Story