Telugu Gateway
Cinema

‘భీష్మ’ ట్రైలర్ వచ్చేసింది

‘భీష్మ’ ట్రైలర్ వచ్చేసింది
X

శివరాత్రికి సందడి చేయనున్న హీరో నితిన్ సినిమా భీష్మ ట్రైలర్ వచ్చేసింది. ఇప్పటికే ఎన్నో అంచనాలు ఉన్న ఈ సినిమాపై ట్రైలర్ కూడా మరింత ఆసక్తిని పెంచింది. ‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్‌, యమధర్మ రాజ్‌, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు. అందుకేనేమో ఒక్కరు కూడా పడటం లేదు నాకు’ అని ఫీల్ అవుతున్నాడు హీరో నితిన్. ఈ డైలాగ్ తోనే ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అంతలోనే రష్మిక ఎంటర్ అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో రష్మిక సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు.

ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు ఆకట్టుకునేలా ఉన్నాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్‌ హైలెట్ గా నిలుస్తుంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్‌ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

https://www.youtube.com/watch?v=8A9mJYprMl4

Next Story
Share it