Telugu Gateway
Cinema

ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా?

ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా?
X

నాగచైతన్య, సాయిపల్లవిల సరదా సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘లవ్ స్టోరీ’ సినిమాకు సంబంధించి ఏయ్ పిల్లా పాట ప్రివ్యూను చిత్ర యూనిట్ శుక్రవారం నాడు విడుదల చేసింది. ఇందులో సడన్ గా సాయిపల్లవి మెట్రో ట్రైన్ లో నాగచైతన్యకు ముద్దు పెడుతుంది. ఈ ముద్దు షాక్ నుంచి తేరుకునేందుకు హీరో ప్రయత్నిస్తున్న తరుణంలో ‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా’ అంటూ సాయిపల్లవి చెప్పే డైలాగ్ ఇందులో హైలెట్ గా నిలుస్తుంది.

ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజీవ్‌ కనకాల, ఈశ్వరీ రావు, దేవయానిలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ తుది దశకు చేరుకున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://www.youtube.com/watch?v=KRmbTCvJ6ns

Next Story
Share it