Telugu Gateway
Cinema

భారతీయుడు2 సెట్స్ లో భారీ ప్రమాదం

భారతీయుడు2 సెట్స్ లో భారీ ప్రమాదం
X

ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు2 సినిమా షూటింగ్ లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. దర్శకుడు శంకర్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ భారీ క్రేన్ పడిపోవటం ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ కు గురయ్యారు. దర్శకుడు శంకర్ కాలు ఫ్రాక్చర్‌ అయింది. మృతుల్లో శంకర్‌ వ్యక్తిగత సహాయకుడు మధు, సహాయ దర్శకుడు కృష్ణ, కేటరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన చంద్రన్‌ ఉన్నారు. చెన్నై శివారు పూందమల్లిలోని ఈవీపీ స్టూడియోలో భారతీయుడు–2 చిత్ర షూటింగ్‌ జరుగుతోంది.

ఇక్కడ భారీ క్రేన్‌లతో ప్రత్యేక సెట్టింగ్స్‌ వేసి చిత్రీకరణ జరుపుతున్నారు. రాత్రి సమయంలో 150 అడుగులున్న క్రేన్‌ హఠాత్తుగా కిందకు పడిపోయింది. ఆ సమయంలో సమీపంలోని ఓ టెంటులో దర్శకుడు శంకర్‌ తన అసిస్టెంట్‌లతో కలిసి మానిటర్‌లో రషెస్‌ చూస్తుండగా.. ఈ ఘటన జరిగినట్టు సమాచారం.సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంపై కమల్‌హాసన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ సెట్స్‌ లో జరిగిన ప్రమాదం మనసుని కలచివేసింది. ముగ్గురు సహాయకులను కోల్పోవడం బాధాకరం. నా బాధ కన్నా వారిని కోల్పోయిన కుటుంబాల బాధ ఎన్నోరెట్లు ఎక్కువ’ అని పేర్కొన్నారు.

Next Story
Share it