Telugu Gateway
Andhra Pradesh

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్

జగన్ అలా ఎంటర్..ఇలా టీడీపీ ఎటాక్
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అలా సీబీఐ కోర్టుకు హాజరయ్యారు..ప్రతిపక్ష టీడీపీ ఎటాక్ ప్రారంభించింది. రకరకాల కారణాలతో సీఎం అయిన తర్వాత దాదాపు ఏడు నెలల పాటు కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు పొందారు. కానీ జనవరి 10న తప్పనిసరిగా హాజరు కావాల్సిందేని కోర్టు ఆదేశించటంతో అనివార్యం అయింది. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమాల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ఫ్రకటన విడుదల చేశారు. అందులోని ముఖ్యాంశాలు...‘కోర్టుబోనులో నిలబడ్డ తొలి ముఖ్యమంత్రి ఘనత జగన్మోహన్ రెడ్డిదే. 63ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వల్ల ఏపికి ఇంత చెడ్డపేరు రాలేదు. ఇలాంటి నేర ప్రవృత్తి ఉన్న సీఎం కావడం వల్లే ప్రజలకు ఈ కష్టాలు. తనతో పాటు మళ్లీ వైసిపి నేతలను, అధికారులను జైలుకు తీసుకెళ్లడం ఖాయం. వీడియో గేముల్లో ముఖ్యమంత్రి, కోడిపందేలలో మంత్రులు సంబరాలు. ఒకవైపు ఆందోళనలతో రాష్ట్రం మండిపోతోంది. సీఎం, మంత్రులు నీరో చక్రవర్తిని మించిపోయారు. ఆందోళనల్లో ముంచి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేశారు. అన్నివర్గాల ప్రజలను నడిరోడ్ల పైకి నెట్టారు. పేదల నోటికాడ ముద్ద లాగేశారు. అన్న కేంటిన్లు, పండుగ కానుకలు, ఫుడ్ బాస్కెట్ అన్నీ రద్దు చేశారు.

కోటి పైగా పేద కుటుంబాలకు ‘‘సంక్రాంతి కానుక’’లు ఎగ్గొట్టారు. క్రైస్తవుడిగా చెప్పుకుంటూ క్రైస్తవుల నోటివద్ద కూడు లాగేశారు. క్రిస్మస్ కానుకలు ఎగ్గొట్టడం క్రైస్తవుడు చేసే పనేనా.? ముస్లింలపై నిజంగా ప్రేమ ఉంటే రంజాన్ తోఫా ఎగ్గొడతారా..? పండుగ కానుకలు ఎగ్గొట్టి పేదలకు రూ.600కోట్ల నష్టం చేశారు. పండుగనాడు పేదలు నెయ్యితో పప్పన్నం తినకుండా చేశారు. అక్కలు,అమ్మలు,చెల్లెమ్మలంటూ, వాళ్లపైకి పోలీసులను ఉసిగొల్పుతారా..? తెనాలిలో మహిళలపై లాఠీచార్జ్ గర్హనీయం. పండుగనాడు కనక దుర్గమ్మకు సారె అడ్డుకంటారా..? దుర్గగుడికి వెళ్లే మహిళలను అడ్డుకోవడాన్ని ఖండిస్తున్నాం. తుళ్లూరు, మందడం మహిళలపై పోలీసుల తోపులాట గర్హనీయం.విజయవాడలో మహిళలను భయభ్రాంతులు చేస్తున్నారు.’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

Next Story
Share it