బిజెపిలో చేరిన సాదినేని యామిని
BY Telugu Gateway4 Jan 2020 5:09 PM IST

X
Telugu Gateway4 Jan 2020 5:09 PM IST
తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన సాదినేని యామిని ఇప్పుడు బిజెపిలో చేరారు. కొద్ది కాలం క్రితమే ఆమె టీడీపీకి గుడ్ బై చెప్పారు. సీనియర్ నాయకులను కాదని మరీ ప్రతి అంశంపైనా ఆమె టీడీపీ తరపున విలేకరుల సమావేశాలు నిర్వహించేవారు. టీవీ చర్చల్లో పాల్గొనేవారు. అలా ప్రాధాన్యత ఇఛ్చింది టీడీపీ అప్పట్లో ఆమెకు. టీడీపీ ఓడిపోవటంతో ఆమె పార్టీకి దూరమయ్యారు.
శనివారం నాడు ఆమె కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఆమెకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. గత నవంబర్లో ఆమె టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి యామిని రాజీనామా చేశారు.
Next Story



