Telugu Gateway
Andhra Pradesh

జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే

జగన్ చెప్పిందే జరిగింది..పేర్లు కూడా అవే
X

అమరావతి ‘లెజిస్లేటివ్ క్యాపిటల్..వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్

కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్

గత ఏడాది డిసెంబర్ 17నన అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పారో అక్షరం పొల్లుపోకుండా అన్ని కమిటీలు అదే చెప్పాయా?. కనీసం పేర్లు కూడా మార్చలేదా?. జగన్మోహన్ రెడ్డి సర్కారు సోమవారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ ఏరియాను ‘లెజిస్లేటివ్ క్యాపిటల్’గా పిలుస్తారు. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ ఏరియాను ఇక నుంచి ‘ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్’గా వ్యవహరిస్తారు.కర్నూలు అర్భన్ డెవలప్ మెంట్ ఏరియా ను ‘జ్యుడిషియల్ క్యాపిటల్’గా ఉంటుంది. ఈ మేరకు సోమవారం నాడు ప్రారంభం అయిన అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఆర్ధిక, శాసననసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ, ఏపీలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగస్వామ్యం లక్ష్యాలుగా బిల్లు ప్రవేశపెట్టారు.

ప్రాంతాల వారీగా అభివృద్ధికి ప్రాంతీయ బోర్డుల ఏర్పాటు అంశాన్ని కూడా ఈ బిల్లులో చేర్చారు. దీంతో ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీసీఆర్ డీఏ చట్టం రద్దు బిల్లును కూడా సభలో ప్రవేశపెట్టారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై చర్చను ప్రారంభించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయని..వీటిని రూపుమాపేందుకు తమ సర్కారు చర్యలు తీసుకుబోతోందని తెలిపారు. దీంతో ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు ప్రధాన పరిపాలనా వ్యవహారాలు విశాఖకు తరలిపోవటం ఖాయం అని తేలిపోయింది. తెలంగాణ వంటి సమస్యలు రాకూడదంటే పరిపాలనా, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని బుగ్గన వ్యాఖ్యానించారు.

Next Story
Share it