Telugu Gateway
Cinema

నాని కొత్త సినిమా ప్రారంభం

నాని కొత్త సినిమా ప్రారంభం
X

ఓ వైపు ‘వి’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటున్న హీరో నాని..కొత్త సినిమాకు కూడా శ్రీకారం చుట్టాడు. నాని హీరోగా నటించనున్న ‘టక్ జగదీష్’ సినిమా షూటింగ్ గురువారం నాడు హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. ఇది నాని 26వ సినిమా. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘టక్‌ జగదీష్‌’అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.

పూజా కార్యక్రమంలో దేవుడి చిత్ర పటాలపై టాలీవుడ్‌ ఆగ్ర నిర్మాత దిల్‌ రాజ్‌ క్లాప్‌ కొట్టారు. చిత్ర యూనిట్‌కు దర్శకుడు కొరటాల శివ స్క్రిప్ట్‌ అందించగా, నవీన్‌ ఎర్నేని కెమెరా స్విచ్చాన్‌ చేశాడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. హరీష్‌ పెద్ది, సాహూ గారపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి ప్రసాద్‌ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

Next Story
Share it