Telugu Gateway
Politics

ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే

ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే
X

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అందులో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే అని వ్యాఖ్యానించారు. మరో పదేళ్లు సీఎం గా తానే ఉంటానని కెసిఆర్ అసెంబ్లీ వేదిగ్గా ప్రకటించారు ..ఇంకా ఊహాగానాలు దేనికి ? అని మీడియా ప్రతినిధులనుద్దేశించి వ్యాఖ్యానించారు. కెటీఆర్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...‘మున్సిపల్ చట్టాన్ని సమర్దవంతంగా అమలు చేయడం నా ముందున్న అతి పెద్ద చాలెంజ్. అక్రమ నిర్మాణాలను ఎటువంటి నోటీసులు లేకుండా కూల్చేసే అధికారం ఈ చట్టం ద్వారా ప్రభుత్వానికి ఉంది. ప్రజలకు కూడా ఈ చట్టం చాలా ఉపయోగ కరం గా ఉంటుంది. పార్టీ లకు అతీతంగా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన వారందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి. మున్సిపల్ చట్టం లోని ప్రతీ నిబంధన పోటీ చేసే అభ్యర్థులు తెలుసుకుంటె మంచిది. ఓ వైపు పల్లె ప్రగతి ,మరోవైపు పట్టణ ప్రగతి రెండు సమాంతరంగా జరిగితే అద్బుత ఫలితాలు వస్తాయని సీఎం భావిస్తున్నారు.

చాలా విషయాల్లో దేశంలో మన రాష్ట్రం ముందుంది.. లిటరసి విషయం లో మనం వెనక బడటం పై సీఎం దృష్టి సారించారు. మున్సిపల్ ఎన్నికల్లో సింహ భాగం గెలుస్తాం. రాజకీయాల్లో ఎత్తు పల్లాలు ఉంటాయి. ఎంపీ ఎన్నికల్లో అనుకున్న ఫలితాలు రాలేదు..కానీ ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థలఎన్నికల్లో మేమే విజయం సాదించాం. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ కు జేజేలు కొడుతున్నారు. అవకాశాన్ని అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్ కంటె మించిన వారు లేరు. తెలంగాణ వస్తే నాయకత్వ లోపం ఏర్పడుతుందని వాదించిన వారే ఇప్పుడు దేశంలో కూడా ఈ తరహా నాయకత్వం అవసరమని కోరుతున్నారు. ఎన్ పి ఆర్ ,ఎన్ ఆర్సీ విషయంలో పార్టీ నిర్ణయం కంటె ప్రభుత్వ నిర్ణయమే ముఖ్యం..అందరి తో మాట్లాడి సీఎం ఓ నిర్ణయం తీసుకుంటారు. నీటి సమస్య ల పరిష్కారం కోసమే పోరుగు రాష్ట్రాలతో సత్సంబంధాలు. జగన్ తోనే కాదు చంద్రబాబు ఉన్నప్పుడు సత్సంబంధాలు కొనసాగాయి...మేము యాగం చేసినప్పుడు ఆయనను పిలిచాం.

రాజధాని శంకుస్థాపన కు ఆయన పిలిచాడు. గోదావరి నీటి ని కృష్ణ బేసిన్ కి ఏపీ ,తెలంగాణ కలిసి తరలించాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఉత్తమ్ అధ్యక్షుడు గా కొనసాగుతడా లేదా అనేది ఆయన వ్యక్తి గత నిర్ణయం. కాంగ్రెస్ ను అంత ఈజీగా తీసుకోము...మా ప్రధాన పోటీ కాంగ్రెస్ తోనే. చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్. బీజేపీ నా చిన్నప్పటి నుంచి అలానే ఉంది... ఆ పార్టీ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే ఉంది ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఓక ఐపీఎస్ ఆఫీసర్ ను దూషించడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం ఇన్ఫ్రాటక్చర్ లో లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తుంది..పూర్తి వివరాలు వచ్చాక..ఆర్థిక పరిస్థితి ని అంచనా వేయోచ్చు. ఎన్నికల కోసం చెప్పారా..లేక విజన్ తో చెప్పారా అనేది కొద్ది రోజుల్లో తెలుస్తోంది. రాష్ర్టాలు భాగుంటేనే దేశం భాగుంటుంది....బెంగుళూరు ,హైదరాబాద్ మధ్య ఢిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరితే..కేంద్రం బుందేల్ ఖండ్ లో ఏర్పాటు చేసింది.

తమకు అనుకూలంగా ,వాల్ల ఎంపీలు ఉన్న చోటే ఇండస్ట్రీలు ఏర్పాటు చేస్తే ఏం లాభం. ఈ సంవత్సరం ఫార్మా సీటీ ప్రారంభం అవుతుంది. ఎల్లుండి ముంబైలో ఓరిగే ఫార్మా మీటింగ్ కు అటెండ్ కాబోతున్నా.ఇన్ లాండ్ వాటర్ వే లు వస్తే నౌక లు భద్రాచలం వరకు వస్తాయి..మాకు శాశ్వత శత్రువులు ,మిత్రులు లేరు...మాకు కాంగ్రెస్ ,బీజేపీ లు రెండు సమానమే.ఎంఐఎం తో గతంలో కలసి పోటీ చేయలేదు.. ఇప్పుడు పోటీ చేయం..మిత్ర పక్షం అయినంత మాత్రాన కలిసి పొటీ చేయాలని లేదు .2020 టీఆర్ఎస్ నామ సంవత్సరం. ఈ దశాబ్దం టీఆర్ఎస్ దే’ అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it