అసెంబ్లీ బాయ్ కాట్ కు టీడీపీ నిర్ణయం
BY Telugu Gateway23 Jan 2020 10:34 AM IST

X
Telugu Gateway23 Jan 2020 10:34 AM IST
శాసనసభ, శాసనమండలిలో బుధవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. రెండు సభల్లోనూ బుధవారం నాడు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు భౌతిక దాడులు జరుగుతాయా? అనే వరకూ పరిస్థితి వెళ్లింది. కానీ తోపులాటలు జరిగాయని కొంత మంది సభ్యులు చెబుతున్నారు. అయినా షెడ్యూల్ లో లేకుండా సమావేశాలను పొడిగించారని.
తాము హాజరు కావాల్సిన అవసరం లేదన్నది టీడీపీ భావనగా ఉంది. గురువారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం జరగనుంది. సభలో తమపై జరిగిన దౌర్జన్యం విషయంలో తదుపరి కార్యాచరణపై టీడీఎల్పీ భేటీలో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని టీడీపీ ఇప్పటికే గవర్నర్కు ఫిర్యాదు చేసింది.
Next Story



