టీడీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
BY Telugu Gateway22 Jan 2020 12:10 PM IST

X
Telugu Gateway22 Jan 2020 12:10 PM IST
తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు పోడియం ను చుట్టుముట్టి జై అమరావతి..జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. సభ్యులు చివరకు స్పీకర్ పోడియం పక్కకు చేరి గట్టిగా నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సభలో ఎవరు దౌర్జ్యంగా ప్రవర్తిస్తునానరో జనం గమనిస్తున్నారని అన్నారు. ఇది మీ ఇళ్లా.. లేక అసెంబ్లీనా అని స్పీకర్ తమ్మినేని టీడీపీ ఎమ్మెల్యేపై ఫైర్ అయ్యారు. టీడీపీ సభ్యుల తీరుతో ఇతర సభ్యుల హక్కులు హరించుకుపోతున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే ఎటువంటి చర్యలకైనా సిద్ధమని హెచ్చరించారు.
Next Story



