Telugu Gateway
Cinema

శర్వాందన్ ‘జాను’ ఫస్ట్ లుక్ వచ్చేసింది

శర్వాందన్ ‘జాను’ ఫస్ట్ లుక్ వచ్చేసింది
X

వినూత్న కథలతో సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం ‘జాను’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ మంగళవారం నాడు విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ కు జోడీగా సమంత నటిస్తోంది. హీరో శర్వానంద్‌ ఎడారిలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఏదో తీక్షణంగా ఆలోచిస్తున్నట్లు కన్పిస్తాడు.

తమిళ సినిమా 96కు రీమేక్ ఇది. తమిళంలో దర్శకత్వం వహించిన ప్రేమ్‌కుమార్‌ తెలుగులోనూ డైరెక్షన్‌ చేస్తున్నాడు. 96కు పనిచేసిన గోవింద్‌ వసంతన్‌ ‘జాను’కు సంగీతం అందిస్తున్నాడు. నిర్మాతగా దిల్‌రాజు వ్యవహరిస్తున్నాడు. సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తవగా, త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Next Story
Share it