వంద కోట్లు దాటిన ‘సరిలేరు నీకెవ్వరు’ వసూళ్ళు
సంక్రాంతి బరిలో నిలిచిన టాప్ మూవీల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్ల రూపాయలపైనే స్థూల వసూళ్ళు సాధించింది. మహేష్ బాబు, రష్మిక మందన నటించిన ఈ సినిమా జనవరి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో కూడా కామెడీ అత్యంత కీలకంగా మారింది. బ్లాక్‌బస్టర్ కా బాప్ అంటూ ప్రచారం చేస్తున్న ఈ సినిమా మూడు రోజుల్లో 103 కోట్ల రియల్ గ్రాస్ వసూలు చేసిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు మహేశ్‌బాబుతో కూడిన సరిలేరు నీకెవ్వరు పోస్టర్‌ను విడుదల చేసింది.
ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించిన విషయం తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో రూ.32.77 కోట్ల షేర్ రాబట్టినట్లు సమాచారం. రెండోరోజు శనివారం సుమారు 20 కోట్ల వరకు ఈ సినిమా రాబట్టిందని సమాచారం. మొత్తానికి తొలిమూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో పెద్దగా కథ లేకపోయినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అంశాలపై దర్శకుడు అనిల్ బాగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక యాక్షన్ తోపాటు పాటలు ఆకట్టుకునేలా ఉన్న సంగతి తెలిసిందే.