Telugu Gateway
Politics

బిజెపిలోకి సైనా నెహ్వాల్

బిజెపిలోకి సైనా నెహ్వాల్
X

క్రీడాకారులు రాజకీయాల్లోకి ప్రవేశించటం కొత్త కాకపోయినా ఇప్పుడు ఓ కొత్తతరం క్రీడాకారిణి అదే బాటలో పయనించటానికి రెడీ అయ్యారు. దేశంలో ప్రముఖ బ్యాండ్మింటన్ ప్లేయర్ గా ఉన్న సైనా నెహ్వాల్ లో బిజెపిలో చేరనున్నారు. ఇప్పటిదాకా బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన సైనా ఇక నుంచి రాజకీయాల్లో ఈ మేరకు రాణిస్తారో వేచిచూడాల్సిందే. సైనా నెహ్వాల్ గతంలో పలుమార్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నట్లు సమాచారం.

29 సంవత్సరాల సైనా.. 20 ఇంటర్నేషనల్‌ టైటిల్స్‌ ను గెలుచుకున్నారు. 2009లో వరల్డ్‌ నంబర్‌ 2, 2015 సంవత్సరంలో వరల్డ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎదిగారు. ప్రస్తుతం ఆమె తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నారు. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె బుధవారం నాడు బిజెపిలో చేరారు. . బిజెపిలో చేరిన వెంటనే ఆమె ఢిల్లీ ఎన్నికల ప్రచారంలోనూ బిజెపి తరపున పాల్గొంటారని సమాచారం.

Next Story
Share it