ఏపీ రాజధాని పరిణామాలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
BY Telugu Gateway12 Jan 2020 6:09 PM IST

X
Telugu Gateway12 Jan 2020 6:09 PM IST
రాజధాని అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని పరిణామాలతో తెలంగాణలోని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి లాభం చేకూరుతుందని వ్యాఖ్యానించారు. నిన్న మొన్నటివరకూ సోదరులు గా ఉన్న రాష్ట్రంలో ముసలం ముట్టడం బాధాకరమన్నారు.
తెలంగాణలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి మేలు చేసి పెట్టేందుకే గందరగోళం సృష్టిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి కుప్పకూలేలా ఉందని అన్నారు. ఏపీ రాజధాని పరిణామాలపై తెలంగాణ వ్యక్తిగా సంతోషంగా ఉందని..భారతీయ పౌరుడిగా బాధగా ఉందని వ్యాఖ్యానించారు.
Next Story



