Telugu Gateway
Cinema

ఐటి దాడులపై రష్మిక మేనేజర్ రియాక్షన్

ఐటి దాడులపై రష్మిక మేనేజర్ రియాక్షన్
X

రష్మిక మందన నివాసాలపై ఐటి దాడులు జరిగినట్లు గురువారం ఉదయమే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రష్మిక టాలీవుడ్ లో వరస పెట్టి హిట్లు కొడుతూ ముందుకెళుతోంది. దీంతో అందరి అటెన్షన్ ఐటి దాడుల వైపు మళ్లింది. అయితే ఆమె మేనేజర్ మాత్రం దాడులు జరిగింది..రష్మిక నివాసంపై కాదు..ఆమె తండ్రి మదన్‌ వ్యాపారాలపై మాత్రమే ఐటీ సోదాలు జరిగాయని చెబుతున్నారు.

రష్మిక ప్రతి అకౌంట్‌, లావాదేవీలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే రష్మిక మేనేజర్‌ మాత్రం.. రష్మికకు సంబంధించిన వ్యవహారాలపై ఐటీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని చెప్పారు.

Next Story
Share it