Telugu Gateway
Telangana

పంజాగుట్టలో రేప్ కలకలం

పంజాగుట్టలో రేప్ కలకలం
X

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో జరిగిన రేప్ కలకలం రేపుతోంది. పదమూడేళ్ల బాలికపై ఓ యువకుడు పది రోజులుగా అత్యాచారం జరుపుతున్నాడు. బాలిక తండ్రి వాచ్ మెన్ గా పనిచేస్తుంటే..తల్లి ఇళ్ళలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నిందితుడు జహంగీర్ బాలిక ఇంటి పక్కనే నివాసం ఉంటాడు. ఓ సారి ఎవరూ లేని సమయంలో బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడు.

జహంగీర్ మక్తాలో పంక్చర్ షాప్ ను నడుపుతున్నాడు. కూతురు ఎప్పటిలా కాకుండా తేడాగా ఉండటంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే నిందితుడిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. దీనిపై పోలీసులు విచారణ ప్రారంభించగా..నిందితుడు పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.

Next Story
Share it