Telugu Gateway
Andhra Pradesh

పవన్ ఆదేశాలను పట్టించుకోని రాపాక

పవన్ ఆదేశాలను పట్టించుకోని రాపాక
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ బేఖాతరు చేశారు. అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ; సీఆర్ డీఏ రద్దు బిల్లును వ్యతిరేకించాలని కోరుతూ రాపాకకు పవన్ లేఖ రాశారు. కానీ సభలో ఉన్న ఏకైక జనసేన ఎమ్మెల్యే అయిన వరప్రసాద్ మూడు రాజదానుల ప్రతిపాదనకు జనసేన అనుకూలంగా అని ప్రకటించారు. ఎక్కడ చూసినా ప్రజలు మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా ఉన్నారని..ప్రజలు అభిప్రాయాన్నే తాను చెబుతున్నానని వ్యాఖ్యానించారు. అంతే కాదు...జగన్మోహన్ రెడ్డిపై సభలో రాపాక వరప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించారు.

Next Story
Share it