Telugu Gateway
Cinema

ప్రకాష్ రాజ్ ను చంపేస్తాం

ప్రకాష్ రాజ్ ను చంపేస్తాం
X

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కు వార్నింగ్. ఈ నెల 29న ప్రకాష్ రాజ్ తోపాటు మరికొంత మందిని హతమార్చనున్నట్లు హెచ్చరిస్తూ ఓ లేఖ వెలువడటం కలకలం రేపుతోంది. ఈ జాబితాలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితోపాటు మొత్తం 13 మంది ఉన్నారు. వీరందరిని హతమారుస్తామని అందులో పేర్కొన్నారు. సంఘ్ పరివార్ పై విమర్శలు చేస్తున్న నిజగుణానంద స్వామికి వచ్చిన లేఖలో ఈ విషయాలు ఉన్నాయి. బెళగావిలో ఉన్న నిజగుణానందస్వామి మఠానికి గుర్తు తెలియని వ్యక్తులు లేఖ పంపారు.

ధర్మ ద్రోహులు, దేశ ద్రోహులను జనవరి 29న హతమార్చేందుకు ముహుర్తం పెట్టాం. మీ చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉండడి అంటూ కన్నడంలో లేఖ రాశారు. ఈ బెదిరింపు వ్యవహారంపై కుమారస్వామి ట్వీట్ల ద్వారా వెల్లడించారు. ఈ వ్యవహారం కర్ణాటకలో ప్రస్తుతం దుమారం రేపుతోంది. సీఏఏపై ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుంచి ఆయన బిజెపికి వ్యతిరేకంగా చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు కూడా ప్రకాష్ రాజ్ పై ఎదురుదాడికి దిగుతున్నారు.

Next Story
Share it