నాపై దాడి వెనక చంద్రబాబు మనుషులు
చినకాకాని వద్ద తన కారుపై జరిగిన దాడి ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించచారు. ఇది తెలుగుదేశం శ్రేణుల పనే అని ఆరోపించారు. పల్నాడులో పుట్టిన తాను ఇలాంటి వాటికి భయపడబోనని వ్యాఖ్యానించారు. తన కారుపై రాళ్లు వేస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. రాజధాని రైతులకు సమస్యలు ఉంటే సీఎం జగన్ తో చర్చలు జరపాలని..సీఎం రైతులకు న్యాయం చేస్తారని అన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దని రైతులకు సూచిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
తన కారుపై దాడి చేసిన వారు ఎవరూ రైతులు కారని..చంద్రబాబు కావాలనే కొంత మంది బయటి వ్యక్తులను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. ఆ దారిలో వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఎవరు వెళ్లినా దాడి చేసేలా పథకం రూపొందించారని ఆరోపించారు. అప్పటికప్పుడు రాళ్లు, కర్రలు ఎక్కడి నుంచి వచ్చాయని పిన్నెళ్లి ప్రశ్నించారు. చంద్రబాబు, నారా లోకేష్ లు నేరుగా తమతో తలపడాలని తెరవెనక రాజకీయాలు మానుకోవాలన్నారు. రాజధాని ఉద్యమం పేరుతో రాష్ట్రంలో శాంతి భధ్రతల సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు.