Telugu Gateway
Politics

తెలంగాణలోనూ ‘పవన్’ బిజెపికే మద్దతు ఇస్తారా?!

తెలంగాణలోనూ ‘పవన్’ బిజెపికే మద్దతు ఇస్తారా?!
X

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. బిజెపి, జనసేనలు పొత్తు కుదుర్చుకున్నాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా కలపి పనిచేస్తామని..అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఏపీ కంటే తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని బిజెపి సర్వశక్తులు ఒడ్డుతోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసింది. అప్పటికి టీఆర్ఎస్ సర్కారు ఏర్పాటై దాదాపు పదేళ్లు అవుతుంది..దీంతో టీఆర్ఎస్ సర్కారుపై పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటం వచ్చే ఎన్నికల్లో తమకు లాభిస్తుందని బిజెపి బలంగా నమ్ముతోంది. ఈ తరుణంలో ఏపీలో జనసేన, బిజెపిలు పొత్తు కుదుర్చుకున్నాయి. గత ఎన్నికల్లో అంటే 2014లో ఏపీలో బరిలో నిలిచిన జనసేన 21.30 లక్షల ఓట్లు సాధించి 6.78 శాతం ఓటు షేర్ ను దక్కించుకుంది. ఫలితాలను తారుమారు చేయటానికి ఈ ఓటు శాతం చాలా కీలకం. గత ఎన్నికల్లో జనసేన అసలు తెలంగాణలో పోటీ చేయలేదు కాబట్టి ఆ పార్టీ బలం ఎంత అనేది చెప్పటం కష్టం. కాకపోతే సినీ హీరో ఇమేజ్ తో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇఛ్చిన పవన్ కళ్యాణ్ కు తెలంగాణలోనూ భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే అది ఒక శాతం ఉంటుందా?. రెండు శాతం ఉంటుందా అన్నది ఇప్పటికిప్పుడు లెక్కకట్టడం కష్టం.

కాకపోతే తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బిజెపికి పవన్ కళ్యాణ్ పొత్తు ఖచ్చితంగా లాభం చేకూర్చటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా నియోజకవర్గాల్లో ఎన్నికల ఫలితాలను తారు మారు చేసేది వెయ్యి నుంచి రెండు వేల ఓట్లే. ఈ మేరకు ఓట్లను సాధించటం జనసేనకు పెద్ద కష్టం కాదు. ఈ లెక్కన జనసేనతో పొత్తు తెలంగాణలో ఖచ్చితంగా బిజెపికి లాభిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఇఫ్పటికిప్పుడు బిజెపి, జనసేనలు తెలంగాణలో పొత్తుపై క్లారిటీ ఇస్తాయా? లేక వేచిచూస్తాయా అన్న అంశంపై కొంత కాలం ఎదురుచూడాల్సిందే. అయితే ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని..మరో రాష్ట్రంలో అందుకు భిన్నమైన వైఖరి తీసుకునే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Next Story
Share it