మూడు రాజధానుల ను ఎవరూ ఆపలేరు
BY Telugu Gateway24 Jan 2020 10:13 PM IST

X
Telugu Gateway24 Jan 2020 10:13 PM IST
రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనను ఆపడటం ఎవరి వల్లా కాదని మంత్రి కన్నబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ మోకాలడ్డు పెట్టినంత మాత్రాన ఇది ఆగదన్నారు. మహా అయితే కొంత ఆలశ్యం అవుతుంది కానీ..రాజధానుల ఏర్పాటును అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
కన్నబాబు శుక్రవారం నాడు విజయవాడతో మీడియాలో మాట్లాడారు. ప్రజల ఆకాంక్షల మేరకే రాజధానుల ఏర్పాటు జరగబోతోందని అన్నారు. మండలి చైర్మన్ కు ఉండే విచక్షణాదికారం ముఖ్యమంత్రికి ఉండదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన జరుగుతుందని అన్నారు.
Next Story



