Telugu Gateway
Andhra Pradesh

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు

బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా మల్లాది విష్ణు
X

ఏపీలో మరో నామినేటెడ్ పోస్టు నియామకం జరిగింది. వైసీపీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మల్లాది విష్ణును బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్ కు విష్ణు కృతజ్ణతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, సీఎం లక్ష్యాలకు అనుగుణంగా పని చేసి, బ్రాహ్మణ సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

బ్రాహ్మణులకు మూడు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. వంశపారపర్యానికి ఆమోదం తెలిపి అర్చకుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వ్యక్తి సీఎం జగన్‌ అని ప్రశంసించారు. బడ్జెట్‌ కేటాయింపుల్లో కూడా ​కార్పొరేషన్‌కు, ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ముఖ‍్యమంత్రి అధిక నిధులు కేటాయించారన్నారు.

Next Story
Share it