Telugu Gateway
Politics

కెసీఆర్, జగన్ ల భేటీ 13న!

కెసీఆర్, జగన్ ల భేటీ 13న!
X

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కెసీఆర్, జగన్మోహన్ రెడ్డి మరోసారి భేటీ అయ్యేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 13న ఈ భేటీ హైదరాబాద్ లో జరగనుంది. ఈ శుక్రవారం నుంచి మూడు, నాలుగు రోజుల పాటు జగన్ హైదరాబాద్ లోనే ఉండనున్నారని సమాచారం. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో తెలంగాణ సీఎం కెసీఆర్ తో చాలా సన్నిహితంగా మెలిగారు. కొద్ది రోజుల క్రితం ఓ సారి వీరిద్దరి భేటీ తర్వాత ఇద్దరూ కలసి బిజెపిపై పోరుకు సిద్ధం అవుతున్నట్లు మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలను కెసీఆర్ ఏ మాత్రం పట్టించుకోలేదు కానీ..ఏపీ సీఎంవో వెంటనే ఖండన విడుదల చేసింది. ఇద్దరు సీఎంల మధ్య బిజెపిపై పోరు లాంటి అంశాలు చర్చకు రాలేదని వెల్లడించింది. దీంతోపాటు రెండు రాష్ట్రాలు కలసి తలపెట్టిన లక్ష కోట్ల రూపాయల పైబడిన ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా అటకెక్కినట్లే కన్పిస్తోంది.

ఏపీ తన ప్రణాళికలు తాను అమలు చేసుకునే పనిలో పడింది. ఏపీలో ఆర్టీసీ విలీనానికి సంబంధించి కూడా సీఎం కెసీఆర్ తెలంగాణ ఆర్టీసీ సమ్మె సందర్భంగా స్వయంగా మీడియాతో మాట్లాడుతూ అది అయ్యేదా చచ్చేదా..కొన్ని రోజులు ఆగండి మీకే అసలు విషయం తెలుస్తుంది అంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఏపీలో ఆర్టీసీ విలీనం ఈ జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది కూడా. గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. విభజన సమస్యలతోపాటు పలు ఇతర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Next Story
Share it