జనసేన, బిజెపిల మధ్య విస్తృత చర్చలు

బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు బిజెపి, జనసేనల చర్చకు సంబంధించిన అంశాలపై ఆయన క్లారిటీ ఇఛ్చారు. తమ భేటీ కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, అమరావతి అంశంపై మాత్రమే కాదని, అంత కంటే విస్తృత స్థాయిలో ఈ చర్చలు ఉంటాయని జీవీఎల్ వెల్లడించారు. వచ్చే నాలుగేళ్లు తాము కలసి పనిచేయాల్సిన అంశాలపై కూడా మాట్లాడుకుంటామని తెలిపారు. 2024 ఎన్నికల వరకూ తమ వ్యూహన్ని ఖరారు చేసుకుంటామని తెలిపారు. గురువారం నాడు విజయవాడలో జనసేన-బిజెపి నేతల కీలక సమావేశం జరగనుంది.
ఈ భేటీ అనంతరం ఇరు పార్టీల నేతలు సాయంత్రం మీడియాతో మాట్లాడనున్నారు. జనసేన తరపున చర్చల్లో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లు పాల్గొంటుండగా, బిజెపి తరపున ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతోపాటు ఆ పార్టీ కీలక నేతలు పాల్గొననున్నారు. జనసేనతో చర్చలకు ముందు బిజెపి కీలక నేతలు అందరూ సమావేశం అయి జనసేనతో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేశారు.