Telugu Gateway
Andhra Pradesh

రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు

రాజధానిపై జగన్ కీలక వ్యాఖ్యలు
X

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాడు ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన అనంతరం రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరుగా రాజధాని అంశాన్ని ప్రస్తావించకుండానే ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో ‘అన్నదమ్ముల్లా అన్ని ప్రాంతాలు కలసి ఉండేలా..ఎప్పటికీ అనుబంధాలు నిలిచేలా వ్యవహరిస్తాం. గతంలో అన్యాయంగా నిర్ణయాలు తీసుకున్నారు. వాటిని సరిదిద్దుతాం. మీరిచ్చిన అధికారాన్ని దేవుడి దయతో వచ్చిన పదవిని అందరి అభివృద్ధికి ఉపయోగిస్తాను. మీ చల్లని చూపులు..ఆశీస్సులు ఈ బిడ్డపై ఉంచాలి. అన్ని ప్రాంతాలకు న్యాయం చేసే నిర్ణయాలు తీసుకుంటాం.

గతంలో తీసుకున్న నిర్ణయాలను సరిదిద్దుతాం. మా దృష్టిలోమూడు ప్రాంతాలు సమానం.’అని వ్యాఖ్యానించారు.ఏపీలో ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల రగడ నడుస్తోంది. రాజధాని కోసం భూములు ఇఛ్చిన రైతులు అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. వీరి ఉద్యమానికి టీడీపీ, జనసేన, బిజెపి, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. అధికార వైసీపీ మాత్రం రాజధాని రైతులతో పాటు విపక్షాలపై ఎటాక్ చేస్తోంది. ఈ తరుణంలో సీఎం జగన్ ఏలూరులో చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Next Story
Share it