Telugu Gateway
Cinema

‘రష్మిక’కు ఐటి చిక్కులు..హాజరుకు నోటీసులు

‘రష్మిక’కు ఐటి చిక్కులు..హాజరుకు నోటీసులు
X

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందనకు ఐటి చిక్కులు తప్పటం లేదు. ఆమె మేనేజర్ ఐటి దాడులకు రష్మికకు సంబంధం లేదని ప్రకటన చేసినా..ఐటి శాఖ అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ నెల21న రష్మిక ఖచ్చితంగా బెంగుళూరులో ఐటి కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందేనని తేల్చిచెప్పారు. అదే సమయంలో రష్మికతోపాటు ఆమె కుటుంబ సభ్యులను కూడా హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. రష్మికతోపాటు ఆమె తండ్రి మదన్‌, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు అందాయి.

మూడు రోజుల క్రితం కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రష్మిక నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటి శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి,పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్‌ తెలిపారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరు అవుతామని ఆయన చెబుతున్నారు.

Next Story
Share it