Telugu Gateway
Politics

ఇలాంటి ‘వేవ్’ నా జీవితంలో చూడలేదు

ఇలాంటి ‘వేవ్’ నా జీవితంలో చూడలేదు
X

ఉద్యోగుల వయో పరిమితి పెంపుపై త్వరలో నిర్ణయం

మైనస్ లో ఉన్నాం..అయినా పీఆర్సీ నివేదికపై నిర్ణయం

‘ నా రాజకీయ జీవితంలో ఎన్నో వేవ్ లు చూశా. ఇందిరాగాంధీ వేవ్. ఎన్టీఆర్ వేవ్. ఇలా ఎన్నో వచ్చాయి. కానీ నిలకడగా ఒక పార్టీకి అన్ని ఎన్నికల్లో ఒకే రకమైన ఫలితాలు ఇచ్చిన వేవ్ లు మాత్రం ఎప్పుడూ చూడలేదు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్, జిల్లా పరిషత్..ఇప్పుడు మునిసిపల్ ఎన్నికలు. ఈ ఫలితాలు అసాధారణం’ అని వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్. మునిసిపల్ ఎన్నికల ఫలితాల వెల్లడి అనంతరం కెసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. ఎంతో విశ్వాసం ఉంటే తప్ప ఇలాంటి ఫలితాలు రావన్నారు. ఆ జిల్లా..ఈ జిల్లా అని లేకుండా అందరూ ఒకేరకమైన ఫలితాన్ని అందించారు. 360 డిగ్రీస్ ఒకే రకమైన ఫలితం. మా విధానాలను ప్రజలు అద్భుతంగా బలపర్చారు. మా ప్రభుత్వంపై వాళ్ల విశ్వాసాన్ని..కాన్ఫిడెన్స్ ను తెలియజేశారు. ఎవరు ఏమి మాట్లాడిన పట్టించుకోవద్దు..మీరు అనుకున్నట్లు ముందుకెళ్లండి అని ఆదేశించినట్లు బావిస్తున్నాం. మా పాలన నచ్చినట్లు మాకు మార్గదర్శనం చేసినట్లు భావిస్తున్నాం. తెలంగాణ ప్రజలకు వ్యక్తిగతంగా..పార్టీపక్షాన కృతజ్ణతలు తెలియజేస్తున్నాం. విజేతలకు అభినందనలు. గెలుపు కోసం అహోరాత్రాలు కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ణతలు. అద్భుతంగా పనిచేసిన నాయకులు. కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాలు. వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ కు ఆశీస్సులు తెలియజేస్తున్నారు. మంచి కో ఆర్డినేషన్ తో పనిచేశారు.

శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయం వచ్చింది. పార్లమెంట్ లోనూ మెజారిటీ స్థానాలు దక్కించుకున్నాం. జిల్లా పరిషత్ ల్లోనూ ఆల్ ఇండియా రికార్డు. మున్సిపల్ ఎన్నికలు ఆపాలని కొంత మంది విశ్వప్రయత్నం చేశారు. ఎన్నికలు ముగిసిపోతే పాలన చేసుకోవచ్చు అని మేం ప్రయత్నం చేశాం. కోర్టుల చుట్టూ తిప్పారు.రకరకాల ఇబ్బందులు పెట్టి ఎన్నికలు జరక్కుండా చేయాలని చూశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైన ప్రజలు ముకక్తకంఠంతో తీర్పు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో విచిత్రమైన పరిస్తితి ఉంటుంది. ఇలా ఏకపక్షంగా తీర్పు ఎప్పుడూ రాదు. ప్రతిపక్షాలు వాళ్లు ఎవరికి మొక్కాలి. నిరంతరం మొరిగే కుక్కలు కొన్ని ఉన్నాయి. హద్దు లేదు..అదుపులేదు. విలువలు లేవు. ముఖ్యమంత్రి ముక్కు కోస్తా అంటారు. ఓ జాతీయ పార్టీ నాయకుడు. అది వాళ్ల సంస్కారం. ప్రజలు కర్రు కాల్చివాత పెట్టినట్లు తీర్పు ఇచ్చారు. కుసంస్కారంగా, వ్యక్తిగత నిందారోపణలకు పోయి దూషించటం. సోషల్ మీడియాలో కూడా నీచాతినీచమైన ప్రచారం చేశారు. వాడు ఎవరైనా సరే..వ్యక్తిగత దూషణలు కనుక బంద్ చేయకపోతే మంచిది కాదు. ఇక నుంచి కఠినంగా ఉండబోతున్నాం. ఇఫ్పటికే పేపర్ కార్టూన్ లం అయిపోయాం. ఇష్టం వచ్చినట్లు భాషలో మాట్లాడటం పద్దతి కాదు.

అధికారం దుర్వినియోం అంటున్నారు. అసలు నేను బయటకే రాలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు. మొదటి నుంచి డిసిప్లిన్ లో బతికాం. ఒక క్రమశిక్షణ అలవాటు అయింది. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ పది మంది ఎమ్మెల్యేలకు ఫోన్లు మాట్లాడి ఉంటాను. ఒక పోలీసు అధికారి, డీజీపీ, చీఫ్ సెక్రటరికి కానీ.జిల్లా కలెక్టర్ కు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. బలిసిన అభ్యర్ధి ఎవరైనా పెట్టి ఉంటే డబ్బు ఖర్చు పెట్టి ఉండొచ్చు. అన్ని పార్టీల వాళ్లు పెట్టారు. అది మాకు సంబంధం లేదు. ప్రజలను అవమానిస్తారా? మీరు గెలిస్తేనే న్యాయంగా గెలిచినట్లు?.ఇతరుల అయితే అన్యాయమా?. స్థాయిని మించి..అధిక ప్రసంగాలు చేస్తే ఎలా ఉంటదో చాలా సార్లు చూశారు. వీటిని ప్రజలు క్షమించరు. హుందాతనంగా , గౌరవప్రదంగా ఉండాలి. రొడ్డగొట్టుడు కొడతామంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇతర పార్టీలకు ఎన్నికలు పొలిటికల్ గేమ్. మాది మాత్రం టాస్క్.

అలా పనిచేస్తాం మేం. ఈ ఫలితం అప్పనంగా రాదు. ఎంతో కష్టపడితే వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ ఖర్చు పెట్టదు. 80 లక్షల వరకూ పార్టీ మెటీరియల్ పంపించాం. రూపాయి పంపించలేదు. అవాకులు ..చెవాకులు మానేసి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించటం నేర్చుకోవాలి. వీళ్ల పిచ్చికూతలు పట్టించుకోకండి అని ప్రజలు మాకు ఇఛ్చారు. మా కార్యవ్యాన్ని..బాధ్యతలను పెంచింది. ప్రజల తీర్పును గుండెల్లో పెట్టుకుంటాం. పల్లె ప్రగతి ద్వారా ఎలాంటి మంచి ఫలితాలను సాధించామో..పట్టణ ప్రగతి ద్వారా కూడా అలాంటి ఫలితాలను సాధిసాం. పట్టణీకరణ 50 శాతం దాటి పోతుంది కాబట్టి సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం. హైదరాబాద్ నగరాన్ని బతికించుకునే బాధ్యత మనపైన ఉంటుంది. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన కొన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి. 57 సంవత్సరాలు దాటిని వారికి పెన్షన్ ఇస్తామని చెప్పాం. 31 మార్చి నుంచి పెన్షన్ 2016 రూపాయలు అందజేస్తాం. బడ్జెట్ లోనే నిధులు కేటాయిస్తాం. ఉద్యోగులకు వయో పరిమితిని పెంచుతామని చెప్పాం. దీనిపై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. పీఆర్సీ రిపోర్టుతో జీతాలు పెంచాలని ఉద్యోగులు ఆశిస్తున్నారు. కానీ మైనస్ లో ఉన్నాం. కేంద్రం సక్కగా పనిచేయటం లేదు. మన రాష్ట్రానికే దాదాపు 5000 కోట్ల రూపాయల బకాయి ఉన్నారు. అయినా ఎంతో కొంత పెంచే ప్రయత్నం చేస్తాం అని తెలిపారు కెసీఆర్.

Next Story
Share it