Telugu Gateway
Cinema

దుబాయ్ లో నితిన్ పెళ్లి!

దుబాయ్ లో నితిన్ పెళ్లి!
X

టాలీవుడ్ హీరో నితిన్ పెళ్లి వార్తలు గత కొంత కాలంగా జోరుగా విన్పిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ హీరో పెళ్ళి వార్తల స్పీడ్ మరింత పెరిగింది. ఈ ఏడాది మేలో నితిన్ పెళ్లి జరగనున్నట్లు తాజా వార్త. అది కూడా దుబాయ్ లో. ఎంపిక చేసిన స్నేహితులు..కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక సాగనున్నట్లు సమాచారం.

నితిన్‌ కు జోడీగా రానున్న అమ్మాయి పేరు షాలిని. ఇది పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం అని టాక్. ఇప్పటికే పెళ్లి పనుల జోరు పెరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం నితిన్ రష్మిక మందనతో కలసి భీష్మ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Next Story
Share it