Telugu Gateway
Politics

ఆ హెరిటేజ్ భూములు రైతులకిచ్చేయండి

ఆ హెరిటేజ్ భూములు రైతులకిచ్చేయండి
X

అమరావతిలో నారా భువనేశ్వరి పర్యటన రాజకీయంగా చర్చనీయాంశం అయింది. తన పర్యటనలో ఆమె రాజదాని జెఏసీకి ఓ బంగారు గాజును అందజేశారు. ఈ వ్యవహారంపై అధికార వైసీపీ ఘాటుగా స్పందించింది. బంగారు గాజు ఇవ్వటం కాదు..ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భాగంగా హెరిటేజ్ సంస్థ కొనుగోలు చేసిన 14 ఎకరాల భూమిని వెనక్కి ఇఛ్చేయాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పి. పుష్పశ్రీవాణి వ్యాఖ్యానించారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో భూములు కొట్టేసింది మీ భర్త చంద్రబాబు కాదా అని ఆమె భువనేశ్వరిని ప్రశ్నించారు.

టీడీపీ నేతలు 4 వేల ఎకరాలు దోచేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆ 4వేల ఎకరాలు రైతులకిస్తే మీరు ఇచ్చిన గాజులకంటే ఎక్కువ మేలు చేస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం ధర్మం కాదని తెలిపారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి చంద్రబాబు, భువనేశ్వరి వ్యతిరేకమని తేలిపోయిందని అన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణతో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని ఆరోపించారు. అందుకే ఇంట్లోని ఆడవాళ్లను తెచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.

Next Story
Share it