Telugu Gateway
Cinema

గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ విడుదల

గోపీచంద్ ‘సీటీమార్’ ఫస్ట్ లుక్ విడుదల
X

గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘సీటిమార్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు విడుదల చేసింది. సందీప్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. తమన్నాతోపాటు దిగంగనా సూర్యవంశీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో కోచ్‌ అవతారం ఎత్తనున్న గోపిచంద్‌ అందుకు తగ్గట్టుగా మారారు.

నెత్తిన టోపీ ధరించి, విజిల్‌ చేత పట్టుకొని ఆటగాళ్లను కూతకు సిద్దం చేస్తున్నట్లుగా పోస్టర్ లో గోపిచంద్‌ కనిపిస్తున్నారు. ఇది గోపీచంద్ 28వ సినిమా. గోపీచంద్‌ ఆంధ్రాజట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపించనున్నారు. మిల్క్‌ బ్యూటీ తమన్నా తెలంగాణ జట్టు కబడ్డీ టీమ్‌ కోచ్‌గా కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాలో భూమిక, రావురమేష్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. సీటిమార్ సమ్మర్ లో సందడి చేసే అవకాశం ఉంది.

Next Story
Share it