Telugu Gateway
Andhra Pradesh

జగన్ ఇంటికే అనుమతి లేదు

జగన్ ఇంటికే అనుమతి లేదు
X

ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా ‘అమరావతి’ కేంద్రంగా ఈ రాజకీయంగా సాగుతోంది. ఇంత కాలం వైసీపీ నేతలు టీడీపీ నేతలపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేయగా..ఇప్పుడు టీడీపీ కూడా రివర్స్ ఎటాక్ ప్రారంభించింది. వైసీపీ నేతలు కూడా భూములు కొన్నారని..విచారణ జరిపిస్తే తమకు అభ్యంతరం లేదని..అయితే అందులో ఈ పేర్లు కూడా చేర్పించాలని డిమాండ్ చేస్తోంది. టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్రకుమార్ శుక్రవారం నాడు జగన్ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2016లో రాజధాని ప్రకటించిన తర్వాత తాను భూములు కొనుగోలు చేశానని తెలిపారు. ఇందులో తప్పు ఉంటే స్వాదీనం చేసుకోవాలని..బినామీ చట్టం కూడా ఉంది కదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్‌ ఇల్లు ఉన్న లేఔట్‌కు అనుమతి ఉందా అని ప్రశ్నించారు. అనుమతి లేని కట్టడంలో ఉన్న సీఎం ఇల్లు కూడా కూల్చుతారా అని ప్రశ్నించారు.

రాజధానికి దగ్గర్లో జగన్ సతీమణి వైఎస్‌ భారతి పేరుపై కూడా భూములు కొన్నారని ఆరోపించారు. రాజధానిని మార్చాలన్న ఆలోచనతోనే వైసీపీ ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. నంబూరి దగ్గర భూములు కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటున్నారని, తాడేపల్లిలో జగన్ బినామీలు భూములు కొన్నారా? లేదా? అని ప్రశ్నించారు. భూములపై విచారణ చేస్తే వైఎస్‌ భారతి, సందూర్‌ కంపెనీలపై చేయాలని డిమాండ్ చేశారు. ఏ విచారణ అయినా చేసుకోవాలని, ప్రజల్ని బలిపశువుల్ని చేయొద్దని ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. ప్రతిపక్షంలో ఉండగా ఆరోపణలు చేశారు..అధికారంలోకి వచ్చాక కూడా అదే పనా? అధికారం మీ చేతిలోనే ఉంది కదా..చేతనైతే చర్యలు తీసుకోండి అని సవాల్ విసిరారు.

Next Story
Share it