Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబుకు జైలు తప్పదు

చంద్రబాబుకు జైలు తప్పదు
X

ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గతంలో ఎన్నడూలేని రీతిలో ఈ విమర్శలు సాగుతున్నాయి. వైసీపీ నేతలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. ఇప్పటికే నివేదికలలో తేల్చిన అంశాలకు కొత్తగా వీడియో రూపం కల్పించారు తప్ప..అందులో కొత్తగా చెప్పింది అయితే ఏమీలేదు. ‘రాజధాని ప్రాంతంలో అసైన్డు భూముల కొనుగోలు, క్విడ్‌ ప్రోకో ఒప్పందాలు, రాజధాని ప్రకటన విషయంలో గందరగోళం, ల్యాండ్‌ పూలింగ్‌ విషయంలో జరిగిన అన్యాయం, లింగమనేనికి సంబంధించిన భూములకు సరిగ్గా పది మీటర్ల దూరంలో రాజధాని సరిహద్దు రేఖ ఆగిపోవడం’ వంటి అంశాలను వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రస్తావించారు. రాజధానిపై భువనేశ్వరి ఎందుకంత జాలి చూపిస్తున్నారని అంబటి ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రచార పిచ్చి వలన పుష్కరాల షూటింగ్‌లో 30 మంది చనిపోయారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినప్పుడు... ఎన్టీఆర్ ఊరు ఊరు తిరుగుతూ తనకు అన్యాయం జరిగిందని చెప్పినప్పుడు ఎందుకు భువనేశ్వరికి జాలి కలగలేదు. రైతులపై ప్రేమా లేదంటే బినామీ భూములు మీద ప్రేమా. సమైక్యాంధ్ర కోసం ఎంతో మంది చనిపోయారు. అప్పుడు ప్రేమ ఎందుకు కలగలేదు. తన కుమారుడు బినామీల పేరుతో కొన్న భూముల కోసం విరాళం ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు. ‘చంద్రబాబు పట్ల రాజధాని రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన కారుణ్య మరణాలు అంటున్నారు. హత్యలు చేసి రాజధాని కోసం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నమ్మిస్తారు. చంద్రబాబు ఎంత నీచానికైనా తెగిస్తారు. జాగ్రత్త’ అని వ్యాఖ్యానించారు.

‘జైలుకు వెళ్ళడానికి చంద్రబాబు సిద్ధంగా ఉండాలి. రాజ్యాంగం మీద చంద్రబాబు ప్రమాణం చేసి చంద్రబాబు మాట తప్పారు. రాజధాని ఇక్కడ నుంచి తరలిపోలేదు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. బినామీ రైతులకు, బ్రోకర్స్‌ కు ప్రభుత్వం న్యాయం చేయలేదు. నిజమైన రైతులకు మాత్రమే ప్రభుత్వం న్యాయం చేస్తుంది. మూడు ప్రాంతాల ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లబ్ది చేకూరుస్తారు. గతంలో హైదరాబాద్‌లో అభివృద్ధి కేంద్రీకృతమైంది. అందువల్లే ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి చంద్రబాబు సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేశారు అని విమర్శించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఇంకా విచారణ జరుగుంది. ఎంతటి పెద్ద వారైనా శిక్ష తప్పదు. పవన్ కల్యాణ్ ఊరేగిoపుగా వెళ్తే ముళ్ల కంచె వేయరా. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌, లింగమనేనికి ఎలాంటి సంబంధం ఉందో అందరికి తెలుసు. చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారు. పవన్ రోజుకొక మాట మాట్లాడుతున్నారు’ అని ఆరోపించారు.

Next Story
Share it